1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (17:01 IST)

మసాలా దినుసులు ఘుమఘుమలాడాలంటే?

మసాలా దినుసులు వంటకాలకు నోరూరించే ఘాటును, రుచిని అందజేస్తాయి. అయితే వీటిని సరైన పద్ధతిలో భద్రపరచకపోతే వాటి సహజమైన సువాసనల్ని కోల్పోతాయి. వాటి రంగు, వాసన కోల్పోకుండా ఉండాలంటే పొడిగా, చల్లని ప్రదేశంలో ఉంచాలి. కాంతి, వేడి, తేమ, ఆక్సిజన్ తగిలితే మంచి వాసన రావు. 
 
వీలయినంతవరకు స్టవ్, ఓవెన్, ఫ్రిజ్, ఇతర కరెంట్ వస్తువులకు దూరంగా ఉంచాలి. వాటి నుంచి వచ్చే ఆవిరి మసాలాదినుసుల్ని పాడు చేసే అవకాశం ఉంది. పొడిచేసి భద్రపరుచుకున్నట్లయితే తడి తగలనీయ కూడదు. కారం, లవంగాలు, జాపత్రి వంటి పొడుల్ని మూతగట్టిగా ఉన్న జార్లలో పోసి ఫ్రిజ్‌లో పెట్టి ఉంచినట్లయితే అవి రంగు కోల్పోకుండా ఉంటాయి. 
 
వాడకానికి అవసరమయినంత తీసుకుని, కాసేపు బయట ఉంచేయకుండా తిరిగి వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తుండాలి. కొంచెం సేపు బయట, ఇంకొద్దిసేపు లోపల ఉంచుతున్నట్లయితే ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వల్ల త్వరగా పాడైపోతుంటాయి. మసాలా దినుసుల్ని విడివిడి సీసాలలో మూతబిగించి ఉంచుకుంటే ఎన్నాళ్ళయినా బాగా ఘుమఘుమలాడుతూనే ఉంటాయి.