గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (17:21 IST)

కరోనాతో 24 గంటల్లో 524 మంది మృతి

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,489 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. 524 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

దీంతో ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 92,66,706కు చేరగా.. కోవిడ్‌ మరణాల సంఖ్య లక్షా ముప్పై ఐదువేలు(1,35,223) దాటింది.
 
ఇక ప్రస్తుతం దేశంలో 4,52,344 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో 36,367 మంది కోవిడ్‌ బాధితులు మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య మొత్తంగా 86,79,138కు చేరింది.