సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (18:08 IST)

ఏపీలో 3 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు - మొత్తం మరణాల సంఖ్య ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రక్కసి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటిపోయింది. గడచిన 24 గంటల్లో మరో 9652 మందికి ఈ వైరస్ సోకింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,396 కేసలు నమోదయ్యాయి. వీటన్నింటితో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,261కి పెరిగింది. 
 
ఇకపోతే, మరణాల సంఖ్య ఆందోళనకరరీతిలోనే ఉంది. తాజాగా 88 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో కన్నుమూశారు. మొత్తమ్మీద రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,820కి పెరిగింది. గత 24 గంటల్లో 9,211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,18,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపురంలో 5051, చిత్తూరులో 9366, ఈస్ట్ గోదావరిలో 15254, గుంటూరులో 7920, కడపలో 4456, కృష్ణలో 2863, కర్నూలులో 6872, నెల్లూరులో 5201, ప్రకాశంలో 4840, శ్రీకాకుళంలో 5220, విశాఖపట్టణంలో 5797, విజయనగరంలో 6931, వెస్ట్ గోదావరిలో 5359 కేసుల చొప్పున యాక్టివ్‌లో ఉన్నాయి. 
 
అలాగే, ఈ జిల్లాల్లో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి చనిపోయిన మృతుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురంలో 238, చిత్తూరులో 257, ఈస్ట్ గోదావరిలో 290, గుంటూరులో 306, కడపలో 125, కృష్ణలో 232, కర్నూలులో 306, నెల్లూరులో 155, ప్రకాశంలో 185, శ్రీకాకుళంలో 175, విశాఖపట్టణంలో 216, విజయనగరంలో 126, వెస్ట్ గోదావరిలో 208 చొప్పున ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 2820 మంది చనిపోయారు.