సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 20 జనవరి 2022 (13:01 IST)

టీకా తీసుకున్న 6 నెలలకే తగ్గిపోతున్న యాంటీబాడీలు: బీపి-షుగర్ వ్యాధిగ్రస్తులు తస్మాత్ జాగ్రత్త

కోవిడ్ టీకా తీసుకున్నాం కదా... మరేం ఫర్వాలేదు అని అనుకునే పరిస్థితి లేదంటున్నారు ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ అధ్యయనకారులు. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ అనేది దీర్ఘకాలం పాటు రక్షణ ఇవ్వదని చెప్తున్నారు.


వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల కాలంలోనే 30 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెపుతున్నారు.

 
బీపి, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఇది ఎక్కువగా గమనించినట్లు చెపుతున్నారు. తాము చేపట్టిన సర్వేలో మొత్తం 1636 మంది పాల్గొనగా వారిలో 30 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు గుర్తించామన్నారు. కనుక బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.