సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (15:45 IST)

బ్లాక్ ఫంగస్ విజృంభణ.. మూడు వారాల్లోనే 31,216 కేసులు

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న బాధితులను బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. మూడు వారాల్లోనే 31,216 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్‌తో 2,109 మంది చనిపోయారని తెలిపారు. అయితే బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే అంఫోటెరిసిన్-బీ ఔషధం కూడా తీవ్రంగా కొరత ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 7,057 కేసులు నమోదు కాగా, 609 మంది చనిపోయారు. 
 
గుజరాత్‌లో 5,418(మరణాలు 323), రాజస్థాన్‌లో 2,976 కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటకలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 25వ తేదీన మహారాష్ట్రలో 2,770, గుజరాత్‌లో 2,859 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. యూపీలో 142 మంది, ఢిల్లీలో 125 మంది చనిపోయారు. బెంగాల్‌లో కేవలం 23 మంది మాత్రమే చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు.