1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (16:51 IST)

#Corona effect: మూఢాలున్నా... పెళ్లిళ్లు జరిగిపోతున్నాయ్!

కరోనాతో ఆగిన పెండ్లీలన్నీ ప్రస్తుతం చకచకా జరిగిపోతున్నాయి. జులైలో చాలా తక్కువ సంఖ్యలో పెళ్లిల్లు జరిగాయి. ఇప్పడు మళ్లీ మంచి ముహుర్తాలు ఉన్నయి. దీంతో కరోనాతో ఇన్నాళ్లు వాయిదా పడిన పెండ్లీలు ఇప్పుడు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా సెకండ్‌ వేవ్‌ అని డాక్టర్ల హెచ్చరికలు, ఇప్పుడు పోతే మళ్ల నాలుగు నెలల దాకా మంచి ముహూర్తాలు లేవని చెప్తున్నారు.  
 
కరోనా వైరస్ కారణంగా ఐదారు నెలలుగా పెండ్లి అనుబంధ పరిశ్రమ అతలాకుతలం అయ్యింది. మ్యారేజ్‌ హాళ్ల ఓనర్లు, ఈవెంట్‌ మేనేజర్లు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, క్యాటరర్స్, డెకరేషన్ వర్కర్స్ వరకు అందరూ నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ పెండ్లీలు ఎక్కువగా జరుగుతుండటంతో ఆ వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. ఫంక్షన్‌ హాళ్లు, కల్యాణ మండపాలు, హోటళ్లలో వేదికలు, డెకరేషన్, ఫొటోగ్రఫీ, క్యాటరింగ్‌ తదితర అన్నింటికి బుకింగ్‌లు జరుగుతున్నాయి. షాపింగ్ మాల్స్‌, జువెల్లరీ షాపుల్లో కాస్త సందడి కన్పిస్తోంది.
 
జనవరి 7వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మే వరకు మూఢాలు ఉన్నాయి. డిసెంబర్‌ 14 నుంచి జనవరి 14 వరకు శూన్య మాసమని పెళ్లిళ్లు చేయరు. కానీ కరోనా, మూఢాల నేపథ్యంలో పెళ్లిళ్లు పెడుతున్నారు. జనవరి 7వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెప్తున్నరు. నవంబర్‌ 9, 21, 26వ తేదీలు డిసెంబర్‌ 3, 9, 11, 16, 23వ తేదీల్లో ముహూర్తాలు ఎక్కువ ఉన్నట్లు చెప్తున్నారు.