శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2020 (15:07 IST)

దేశంలో కరోనా కొత్త కేసులు 38,074: కోలుకున్నవారు 42 వేలమంది

దేశంలో కరోనా మహమ్మారి కాస్త నెమ్మదించింది. ఐతే కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశ ఆర్ధికాభివృద్ది పూర్తిగా స్తంభించిపోయింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెలువరించిన తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 38,074 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,91,731కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,033మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 448 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,27,059కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 79,59,406 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా 5,05,265 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో, హోం క్వారంటైన్లో  చికిత్స పొందుతున్నారు.