1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (18:22 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. 24 గంటల్లో 3,166 కేసులు.. ఎక్కడంటే?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 83,885 మంది నమూనాలు పరీక్షించగా.. 3,166 కొత్త కేసులు నమోదయ్యాయి. 21 మంది మృతిచెందారు. కరోనా నుంచి మంగళవారం ఒక్క రోజే 4,019 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,356 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపింది. 
 
కరోనా వల్ల చిత్తూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మృతిచెందారు.
 
అలాగే తెలంగాణలో కరోనా వ్యాప్తి  రోజు రోజుకుతగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 784 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా  పాజిటివ్ కేసుల సంఖ్య 6,28,282కి చేరింది. ఇందులో 11,455 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,13,124 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
అటు గడిచిన 24 గంటల్లో 1028 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 5 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3703కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 1,05,186 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 1,92,74,985కి చేరింది.