శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (20:05 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు

Corona
Corona
ఏపీలో కరోనా కేసులు సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 3 వేల 042 మందికి కరోనా సోకింది. 28 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
 
ఏపీలో ప్రస్తుతం 33 వేల 230 యరోనా యాక్టివ్ కేసులున్నాయి. 12 వేల 898 మంది మృతి చెందారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఏడుగురు చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 665 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 19,08,065 పాజిటివ్ కేసులకు గాను 18,61,937 మంది డిశ్చార్జ్ అయ్యారు.
 
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 71,800 కరోనా పరీక్షలు నిర్వహించగా, 605 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 107 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 
 
అదే సమయంలో 1,088 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,26,690 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,11,035 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,964 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,691కి చేరింది.