శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జులై 2021 (14:53 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్..

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2930 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా 18,99,748 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 35,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే నిన్న 4,346 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. రికవరీ కేసుల సంఖ్య 18,51,062కి చేరింది. అటు తాజాగా 36 మంది వైరస్ కారణంగా మరణించడంతో.. మృతుల సంఖ్య 12815కి చేరింది.
 
ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం 100, చిత్తూరు 443, తూర్పుగోదావరి 591, గుంటూరు 236, కడప 117, కృష్ణ 204, కర్నూలు 119, నెల్లూరు 185, ప్రకాశం 363, శ్రీకాకుళం 105, విశాఖపట్నం 70, విజయనగరం 59, వెస్ట్ గోదావరి 338 కేసులు నమోదయ్యాయి.
 
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 71,800 కరోనా పరీక్షలు నిర్వహించగా, 605 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 107 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 
 
అదే సమయంలో 1,088 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,26,690 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,11,035 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,964 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,691కి చేరింది.