శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (14:45 IST)

కరోనా వ్యాక్సిన్‌తో పులివెందులలో అంగన్వాడీ టీచర్ మృతి

దేశంలో వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ వేసుకున్న కొందరు అస్వస్థతకు గురవ్వడం కొందరు చనిపోవడంతో వ్యాక్సిన్ విషయంలో పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్వాడీ టీచర్ మృతి చెందారు.  ఈ  విషాదకర సంఘటన కడప జిల్లా, పులివెందులలో చోటుచేసుకుంది. 
 
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న టి.నారాయణమ్మ అనే అంగన్ వాడీ టీచర్ మృతి చెందింది. పులివెందుల పట్టణానికి చెందిన నారాయణమ్మ రెండు వారాల క్రితం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటినుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారని ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. టైఫాయిడ్ జ్వరంగా వైద్యులు గుర్తించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు.
 
ఆస్పత్రిలో చికిత్స తర్వాత కూడా నారాయణమ్మకు జ్వరం తగ్గలేదని దీంతో గురువారం ఆమెను ఇంటికి తీసుకొచ్చామని చెప్పారు. ఇంటికి వచ్చిన గంట సమయం లోపే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ వికటించడం వల్లే ఆమె మృతి చెందిందని కుటంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.