సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (18:55 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. తెలంగాణలో 181, ఏపీలో 210 కేసులు

ఏపీలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత 24 గంటల్లో 210 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ఏకంగా 85 కేసులు నమోదయ్యాయి. 41 కేసులతో తూర్పుగోదావరి జిల్లా రెండో స్థానంలో ఉంది. 
 
విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఒక్క కేసు నమోదైంది. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,91,388కి చేరుకున్నాయి. 7,180 మంది ఇప్పటి వరకు మృతి చెందారు.
 
తెలంగాణలో కొత్త‌గా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ  వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 163 మంది కోలుకున్నారు. 
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,717కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,195 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,650గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,872 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 733 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 44 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.