శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 మార్చి 2021 (13:20 IST)

మీకు దణ్ణం పెడతా, మాస్కు తీయొద్దు మహాప్రభో, ఎవరు?

మహారాష్ట్రలో ఇదీ సంగతి... మాస్కు లేకుండా ముక్కు పట్టుకుని...
కరోనావైరస్. టీకాలు వేస్తున్నప్పటికీ తన వేగాన్ని మరోసారి పెంచుతూ దూసుకెళ్తోంది ఈ వైరస్. దేశంలో 24 గంటల్లో 22,854 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోనే సగం కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 126 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,58,189 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఇటీవలి కాలంలో చాలామంది మాస్కులు తీసేసి ధైర్యంగా తిరిగేస్తున్నారు. రాజకీయ నాయకులు సైతం మాస్కులను గాలికొదిలేసి సమావేశాలకు, ప్రారంభోత్సావాలకు, పరామర్శలకు వెళ్లిపోతున్నారు. ఐతే కరోనావైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గలేదని గణాంకాలు చెపుతున్నాయి.
 
దేశంలోని నగరాలతో పోల్చితే గ్రామాల్లో ఈ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం.. నగరవాసుల కంటే గ్రామీణులు ఎక్కువగా మాస్కులు వాడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా మాస్కు లేకుండా వారి వద్దకు వెళితే.. దయచేసి మాస్కు ధరించండి అని అడుగుతున్న ఘటనలు కన్పిస్తున్నాయి. వ్యవహారం చూస్తుంటే చదువుకున్న వారికంటే చదువు లేనివారే కరోనా పట్ల అప్రమత్తంగా వున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికైనా కరోనా పట్ల జాగ్రత్తగా వుండటం మంచిది. టీకా వచ్చింది కదా... మరేం ఫర్వాలేదని మాస్కు లేకుండా వెళితే మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.