కరోనా వ్యాక్సిన్‌ను మనం మెడికల్ షాపుల్లో కొనవచ్చట..

covid 19 vaccine
covid 19 vaccine
సెల్వి| Last Updated: బుధవారం, 20 జనవరి 2021 (11:21 IST)
కరోనా వ్యాక్సిన్‌ను మనం షాపుల్లో కొనవచ్చట.. ఫిబ్రవరి చివరి వారం నుంచే టీకాలు మార్కెట్లోకి వచ్చే చాన్స్‌ ఉందని సమాచారం. ఎవరికి వారే బహిరంగ మార్కెట్లో వ్యాక్సిన్లను కొనే వీలు కలుగుతుంది. తద్వారా కరోనా వ్యాక్సిన్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న ఉత్కంఠకు తెరపడింది. వ్యాక్సిన్‌ కోసం సామాన్యులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి నుంచి సామాన్యులకు టీకా పంపిణీ పూర్తిగా అందుబాటులోకి రానుంది.

ఇకపోతే.. వ్యాక్సినేషన్‌ పంపిణీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో 3వ రోజు 51వేల 997 మందికి టీకా వేశారు. ఇక టీకా తీసుకున్న వారిలో 51 మందిలో స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఈనెల 22 నాటికి ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ పూర్తికానుంది.

ఈనెల 24న మిగిలిన వారికి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగులకు కొవిడ్‌ చికిత్స ఖర్చు లక్ష వరకు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉచితంపై కేవలం ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల వరకే మాత్రమే కేంద్రం స్పష్టత ఇచ్చింది.దీనిపై మరింత చదవండి :