శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (22:37 IST)

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 2331 కేసులు.. 11మంది మృతి

ఏపీలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకూ కేసులు సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. తాజాగా రాష్ట్రంలో కేసులు 2 వేల మార్క్ కూడా దాటిపోయాయి. గత 24 గంటల వ్యవధిలో 31,812 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2331 మందికి పాజిటివ్ అని తేలింది. ఇందులో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368, కృష్ణా జిల్లాలో 327 కేసులు వెలుగుచూశాయి. 
 
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి మొత్తం 11మంది మృతి చెందగా, ఇప్పటివరకు 7,262 మంది మరణించారు.  
 
చిత్తూరు జిల్లాలో నలుగురు, కర్నూల్‌లో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు అలాగే విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఏపీలో ప్రస్తుతం 13,276 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,53,02,583 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
 
తాజా కేసులతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,10,379కి చేరింది. ఇందులో ఇప్పటికే 8,89,841 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక యాక్టివ్ కేసులు 1300 దాటిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 13,276 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.