ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (10:45 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి.. పెరుగుతున్న కోవిడ్ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 517 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. తాజాగా 862 మంది కరోనాతో కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,64,606కు చేరింది. మొత్తం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,73,858 చేరగా, 1474 మంది మృతి చెందారు. మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,778 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 5,803 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీలో 102 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. అలాగే కరోనా మరణాల్లో సైతం స్వల్పంగా పెరుగుదల కనిపించింది. అలాగే డిశ్చార్జిల సంఖ్య కూడా పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య ఐదు వేల స్థాయికి పడిపోయింది. ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 60,329 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 667 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,71,972కి చేరింది.