ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 మే 2021 (16:27 IST)

గోశాలలో కోవిడ్ కేర్ సెంటర్‌.. గోమూత్రంతో ఔషధాలు

కరోనా బాధితుల కోసం కోవిడ్ కేర్ సెంటర్లు ఎక్కడపడితే అక్కడ ఏర్పటవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ గోశాలలో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్నారు కొంతమంది. 
 
హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్లతో బెడ్స్ అన్నీ నిండిపోవటంతో ఇటువంటి సహాయక చర్యలు చాలా మంచిదే. కానీ ఈ గోశాలలోని కోవిడ్ బాధితులకు మెడిసిన్ గా ఏమిస్తున్నారో తెలుసా..'గోమూత్రం' గోమూత్రంతో పాటు గోమూత్రంతో తయారు చేసిన ఔషధాలను ఇచ్చి చికిత్సనందిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని ఓ గోశాలలో ఆ శాల ట్రస్టీ నిర్వాహకులు శాలలోనే ఓ కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఉంటున్న కరోనా బాధితులకు ఆవు పాలు, ఆవు మూత్రంతో తయారు చేసిన ఔషధాలను ఇచ్చి.. చికిత్స చేస్తున్నారు. 
 
తేలికపాటి లక్షణాలు కలిగిన కరోనా బాధితులకు ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ సెంటర్ ను ''వేదలక్షణ పంచగవ్య ఆయుర్వేద కోవిడ్ ఐసోలేషన్ సెంటర్'' అని పేరు పెట్టారు. ఈ సెంటర్‌కు కొంతమంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.