సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (23:12 IST)

3 గంటల వ్యవధిలో.. 100 పడకలతో కూడిన ఆక్సిజన్ బెడ్స్.. ఆర్మీ అదుర్స్

రాజస్థాన్‌లో ఇండియన్ ఆర్మీ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. కేవలం మూడు గంటల వ్యవధిలోనే 100 పడకల ఆక్సిజన్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లోని బార్మెల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉన్న కస్తూర్బా గర్ల్స్ హైస్కూల్ లో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. జిల్లాలో కేసులు పెరిగిపోతుండటంతో జిల్లా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. 
 
పైగా ఆక్సిజన్ బెడ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు ఇండియన్ ఆర్మీ సహాయం కోరారు. రాత్రి 9 గంటల సమయంలో అధికారుల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ 40 మంది సైనికులను రంగంలోకి దించింది. 
 
కేవలం 3 గంటల వ్యవధిలో అంటే రాత్రి 12 గంటల వరకు 100 పడకలతో కూడిన ఆక్సిజన్ బెడ్స్ సౌకర్యం కలిగిన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా ఆసుపత్రిపై కొంతమేర ఒత్తిడి తగ్గింది.