బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 డిశెంబరు 2021 (13:24 IST)

దేశంలో కోవిడ్ కొత్త కేసులు 7,992: 24 గంటల్లో 393 మంది మృతి

కోవిడ్ కోరలు చాస్తూనే వుంది. దేశంలో 7,992 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో 393 మరణాలు నమోదయ్యాయి.


దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,682,736కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 4,75,128కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాలు చెపుతున్నాయి. దేశంలో ఈరోజు 9,265 రికవరీలు నమోదయ్యాయి.

 
యాక్టివ్ కోవిడ్-19 కేసులు 24 గంటల వ్యవధిలో 1,666 మేర తగ్గుదల నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 93,277 వద్ద ఉంది. జాతీయ COVID-19 రికవరీ రేటు 98.36 శాతంగా నమోదైంది. ఇది గత ఏడాది మార్చి నుండి అత్యధికం.

 
రోజువారీ పాజిటివిటీ రేటు 0.64 శాతంగా నమోదు చేయబడింది. గత 68 రోజులుగా ఇది రెండు శాతం కంటే తక్కువగా ఉంది.