గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మే 2021 (11:35 IST)

థర్డ్‌ వేవ్‌ మొదలైందంటూ వార్తలు.. పిల్లలపైనే ఎక్కువ ప్రభావం

కరోనా సెంకడ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తోంది. మరోవైపు దేశంలో అక్కడక్కడ కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలైందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే మూడో వేవ్‌లో వైరస్‌ ప్రభావం పిల్లలపైనే ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులంతా హెచ్చరిస్తున్నారు. 
 
మొదటి దశలో పెద్దవాళ్లపై, రెండో దశలో యువతపై కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే మూడో దశలో మాత్రం పిల్లలు దీనికి ఎక్కువగా ప్రభావితమవుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 
 
పిల్లలకు కరోనా సోకినా అంత ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది. అయితే వారి నుంచి పెద్దలకు వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. పిల్లలకు కరోనా సోకినా వారిలో వ్యాధి లక్షణాలు సాధారణంగానే ఉంటాయని ఆస్పత్రుల్లో చేర్చాల్సినంత సీరియస్ గా పరిస్థితి ఉండదని నీతి అయోగ్ తెలిపింది.
 
అయితే 10 నుంచి 12 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు ఇతర పిల్లల్ని గుంపులుగా కలుస్తుంటారు కాబట్టి వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది.
 
ఈ నేపథ్యంలోనే సెకండ్‌ వేవ్‌ నేర్పిన గుణపాఠంతో థర్డ్‌వేవ్‌కి ముందుగానే సన్నద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు నియమించిన నిపుణుల కమిటీ సలహా మేరకు ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.