శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఆర్. సందీప్
Last Modified: బుధవారం, 3 జూన్ 2020 (17:26 IST)

కరోనా వైరస్ ఆ కాలంలో ఎక్కువగా వస్తుందట

నోటి తుంపర్ల ద్వారా ప్రధానంగా వ్యాపించే కరోనా శీతాకాలంలో ఎక్కువగా విజృంభిస్తుందని పరిశోధనల్లో తేలింది. శీతాకాలంలో వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆస్ట్రేలియా పరిశోధకులు చెప్పారు. శీతాకాలాన్ని ఇకపై కోవిడ్ కాలంగా కూడా చెప్పుకోవచ్చని తెలిపారు.
 
గతంలో వచ్చిన సార్స్-కోవ్, మెర్స్-కోవ్ మహమ్మారులకు వాతావరణ మార్పులతో సంబంధం ఉన్న కారణంగా, కోవిడ్-19పై కూడా పరిశోధనలు జరిపామని చెప్పారు. వ్యాధి వ్యాప్తికి శీతల వాతావరణం కంటే గాల్లో ఉండే తేమ శాతమే ప్రధాన కారణమని చెప్పారు. ఉత్తర భూగోళంలో వేసవిలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
శీతాకాలంలో గాల్లో తేమ తక్కువగా ఉండటంతో తుంపర్ల పరిమాణం తగ్గుతుందని, తేలికగా ఉండి గాల్లో ఎక్కువ సేపు ఉండే అవకాశం ఉందని, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు దాని వల్ల వ్యాధి ఎక్కువ మందికి సోకుతుందని చెప్పారు.