శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (18:54 IST)

వ్యాధి కంటే చికిత్స కఠినంగా ఉండకూడదు: ఎలన్ మస్క్

elon musk
2019 చివరిలో చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇన్ఫెక్షన్, 2020లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి, ప్రపంచ దేశాలను వణికించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచింది. మిలియన్ల మందిని పొట్టనబెట్టుకుంది. 
 
దీన్ని ఎదుర్కోవడానికి, భారత్‌తో సహా పలు దేశాలు వ్యాక్సిన్లను కనిపెట్టాయి. కొన్ని నెలల వ్యవధిలో ఒకదాని తర్వాత ఈ వ్యాక్సిన్లను వేయించుకోవాలని  ప్రభుత్వాలు ప్రజలను ఒత్తిడి చేశాయి. 
 
ఈ నేపథ్యంలో ఓ ట్విట్టర్ యూజర్ కరోనా వ్యాక్సిన్ వాడకం తగ్గుతోందని, కొన్ని దేశాలు దీనిని ఉపయోగించడం మానేశాయని వ్యాఖ్యానించారు. దీనిపై తన అధికారిక X ఖాతాలో దీనిపై.. ట్విట్టర్ సీఈవో ఎలోన్ మస్క్ మాట్లాడుతూ.. టీకాలు, బూస్టర్‌లను పొందమని ప్రజలను బలవంతం చేయడం సరికాదన్నారు. 
 
టీకాలు వేయనందుకు మంచి ఉద్యోగిని తొలగించడం కంటే నేను జైలుకు వెళ్లడం మంచిది. అది మాత్రమే కాదు. వ్యాక్సిన్ మూడో డోస్  తర్వాత నేను కూడా ఆసుపత్రిలో చేరాను. 
 
వ్యాక్సినేషన్ తర్వాత చాలా మందికి వ్యాధి నుండి వచ్చే శారీరక సమస్యల కంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. వ్యాక్సిన్ అనేది వ్యాధినిరోధించేందుకు ఉపయోగపడాలే కానీ వ్యాధి కంటే చికిత్స కఠినంగా ఉండకూడదని ఎలన్ మస్క్ అన్నారు.