గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (19:35 IST)

హాస్టల్‌లో 37మంది విద్యార్థులు, నలుగురు సిబ్బందికి కరోనా

కరోనా జనాలకు నిద్రలేకుండా చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా హయత్‌నగర్‌లో కరోనా కలకలం రేగింది. సోషల్ వెల్ఫేర్ గురుకుల జూనియర్ కాలేజీ హాస్టల్‌లో 37మంది విద్యార్థులు, నలుగురు సిబ్బందికి కరోనా సోకింది. హాస్టల్లో మొత్తం 400 మంది విద్యార్థులు ఉన్నారు. 
 
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హాస్టళ్లలో, స్కూల్‌లలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు తిరిగి ప్రారంభమైన తర్వాత కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
 
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులను సైతం కరోనా వెంటాడుతోంది. విద్యార్థులను బడికి పంపడానికే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా మహమ్మారికి కోనరావుపేటలోని కస్తూర్భా పాఠశాలలోని 15మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. 
 
వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం కరోనాకు గురయ్యారు. కరోనా భయం పోతుందనుకున్న దశలో జిల్లాలో మళ్లీ గడగడలాడిస్తుండడంతో విద్యార్థులను పాఠశాలకు పంపడానికి భయపడుతున్నారు.