శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: గురువారం, 9 జులై 2020 (19:01 IST)

ఈశాన్య భారతంలో కరోనా తగ్గుముఖం.. అదే కారణం

దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య భారతదేశంలో కరోనా కేసులు ప్రస్తుతం నియంత్రణలో ఉన్నాయి. ఈ అంటువ్యాధిని ఎదుర్కొంటున్న  ప్రభుత్వం మరియు ప్రజల క్రమశిక్షణకు ఇది అద్దం పడుతుంది. జూలై 5 నాటికి 37 లక్షల జనాభా కలిగిన మేఘాలయాలో మొత్తం 70 కేసులు నమోదయ్యాయి. ఇందులో 43 మంది చికిత్స నిమిత్తం కోలుకొని ఇంటికి వెళ్లగా ఒకరు మాత్రము మరణించారు.
 
కరోనాపై మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ, కరోనా విషయంలో లాక్డౌన్ కంటే ముందే తాము అప్రమత్తమయ్యామని అన్నారు. ఈ అంటువ్యాధి యొక్క భయాన్ని ఎదుర్కోవటానికి సన్నహాలు ప్రారంభించామని, ఈ విషయంలో ప్రభుత్వం తరపున చేయవలసిన అన్నిఏర్పాట్లు సమర్థవంతంగా చేయగలుగుతున్నామని అన్నారు.
 
అలాగే సామాజిక దూరంతో పాటు ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టామని అన్నారు. వీటిని అనుసరించడానికి పట్టణ, గ్రామ ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు.