గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (20:37 IST)

కేరళలో 13 మందికి కొత్త వైరస్, వణుకుతూ రెండ్రోజుల్లోనే చనిపోతున్న కుక్కలు

కేరళలో ఒకవైపు కరోనా భయపెడుతుంటే ఇంకోవైపు నోరో వైరస్ అనే కొత్త వ్యాధి వెలుగుచూసింది. ఈ వ్యాధి బారిన పడినవారు అందరూ ఓ పశువైద్యశాల విద్యార్థులుగా గుర్తించారు. ఈ వ్యాధి లక్షణాలను 13 మందిలో గమనించారు. వారందరూ వాంతులు, డయారియాతో బాధపడుతున్నారు. ఐతే మందులతో ఈ సమస్య తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు.


ఇదిలావుంటే కేరళలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే 20 కుక్కలు చనిపోయాయి. ఈ కుక్కలు రెండ్రోజుల పాటు వణుకుతూ ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మృతి చెందినట్లు చెపుతున్నారు. కుక్కలు ఇలా చనిపోవడాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

 
కాగా ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేసారు. జంతువుల నుంచి జంతువులకు వ్యాపించే ఈ వ్యాధికి కారణం కనైన్ డిస్టెంపర్ వైరస్ అని వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ మనుషులకు సోకినట్లు ఎక్కడా దాఖలాలు లేవని చెప్పారు.