మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 15 జనవరి 2022 (15:02 IST)

విజృంభిస్తున్న కరోనా, 24 గంటల్లో 2.68 లక్షల కొత్త కేసులు: బుజ్జీ మాస్క్ వేసుకుని వెళ్లూ....

కరోనావైరస్ మరోసారి విజృంభిస్తోంది. దేశంలోని 28 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 6,041 ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో సహా 2.68 లక్షల కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

 
ఈ కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసులు 3.67 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 3.85 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 94.83 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతంగా నమోదయ్యింది.

 
వారంవారీ పాజిటివిటీ రేటు 12.84 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో నిర్వహించబడిన మోతాదుల సంఖ్య 156.02 కోట్లకు మించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆరోగ్యశాఖ సూచన చేస్తుంది. ఐతే చాలామంది మాస్కులను ధరించడం మానేశారు. ఈ ఫలితమే కరోనా కేసులు విపరీతంగా పెరుగిపోతున్నాయి.