శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (13:15 IST)

కరోనా వైరస్: భారత్‌లోనే అత్యధికంగా వ్యాక్సిన్లు...

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఆయా దేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో కన్నా భారత్‌లోనే..అత్యధికంగా వ్యాక్సిన్లు వేసినట్లు సమాచారం.
 
భారత్ కన్నా..అమెరికా, బ్రిటన్ ఇతర దేశాలు టీకా పంపిణీ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ వాటన్నిటి కన్నా..వేగంగా..టీకాలు వేయడంలో భారత్ ముందు వరుసలో నిలిచింది. 13 రోజుల్లో 30 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించింది. 
 
అత్యంత వేగంగా ఈ పంపిణీ జరిగినట్లు డేటా చెబుతోంది. 30 లక్షల మార్క్ ను చేరుకోవడానికి అమెరికాకు 18 రోజులు, ఇజ్రాయిల్ కు 33 రోజులు, బ్రిటన్ కు 36 రోజులు పట్టింది.
 
కర్ణాటక 2,86,089 ఫస్ట్ ప్లేస్ లో నిలవగా… మహారాష్ట్ర 2,20,587, రెండో స్థానంలో నిలవగా..రాజస్థాన్ 2,57,833 మూడో స్థానంలో నిలిచింది. తర్వాత.. ఉత్తరప్రదేశ్ 2,94,959 రాష్ట్రం ఉంది. రోజుకు సగటున 5 లక్షల మందికి టీకాలు వేస్తున్నారని సమాచారం. 
 
భారతదేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1,07,20,048, మృతుల సంఖ్య 1,54,010. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్‌ను అమలు పరిచిన సంగతి తెలిసిందే. జనవరి 16వ తేదీన వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన సంగతి విదితమే.