సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (14:01 IST)

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

corona visus
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారంతో పోల్చుకుంటే ఆదివారం నమోదైన కేసుల తక్కువగా ఉంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 10,112 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 64,806 క్రియాశీలక కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. శనివారం రోజున మొత్తం 12,193 కేసులు నమోదైన విషయం తెల్సిందే.
 
ఇక గడిచిన 24 గంటల్లో 29 మంది చనిపోయారు. వీరిలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఏడుగురు చనిపోయారు. తాజా మరణాలతో దేశంలో మొత్తం కరోనా కరోనా మరణాల సంఖ్య 5,31,329కు చేరింది. కరోనా వ్యాప్తి తీవ్రతను సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.