గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (11:02 IST)

దేశ వ్యాప్తంగా 11 వేల కరోనా పాజిటివ్ కేసులు - మృతులు 28

pneumonia after corona
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం 12 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఈ సంఖ్య 11 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 11692 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, కరోనా వైరస్ నుంచి మరో 66170 మంది కోలుకున్నారు. 
 
దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రచురించిన గణాంకాల ప్రకారం.. 
గత 24 గంటలకు కొత్తగా కోవిడ్ సంక్రమణ సంఖ్య: 11,692.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ క్రియాశీలక కేసుల సంఖ్య: 66,170.
ఇప్పటివరకు కోవిడ్ వైరస్ బాధితుల సంఖ్య: 4,48,69,684 (4.48 కోట్లు)
గత 24 గంటల సమయంలో డిస్చార్జ్ అయిన వారి సంఖ్య: 10,827
ఇప్పటివరకు కోవిడ్ వైరస్ కోలుకున్న వారి సంఖ్య: 4,42,72,256.
గత 24 గంటలకు మరణించిన వారి సంఖ్య: 28.
ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య: 5,31,258.
ఇప్పటివరకు వేసిన కోవిడ్ డోస్‌ల సంఖ్య 220.66 కోట్లు