గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (10:08 IST)

దేశంలో కొత్తగా మరో 2541 కరోనా పాజిటివ్ కేసులు

covid
దేశంలో కొత్తగా మరో 2541 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతి చెందగా, 16,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 1862 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అదేసమయంలో దేశంలో కరోనా వైరస్ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో పాజిటివిటీ రేటు కూడా 0.84 శాతానికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయనీ రికవరీ రేటు 98.75 శాతంగా ఉందని, మరణాల సంఖ్య 1.21 శాతంగా ఉందని పేర్కొంది.