1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (19:36 IST)

కరోనాకు విరుగుడు కనిపెట్టిన ఇజ్రాయేల్ శాస్త్రవేత్తలు?!

ఎట్టకేలకు కరోనా వైరస్‌కు ఇజ్రాయేల్ మందు కనిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా వార్తా కథనాలను ప్రసారం చేస్తోంది. కరోనా వైరస్ బారిపడి తీవ్ర అస్వస్థతకు గురైనవారు కూడా ఈ మందుతో 100 శాతం కోలుకుంటున్నట్టు తెలిసింది. ఈ మందును ప్లూరిస్టెమ్ థెరాపెటిక్స్ అనే బయోటెక్ కంపెనీ ఈ మందును తయారు చేసింది. 
 
ఇజ్రేల్‌లోని హైఫాలో గల ఈ కంపెనీ తయారుచేసిన కరోనా మందు పేరు అలోజెనీక్ ప్లాసెంటల్ ఎక్స్‌పాండెడ్ సెల్స్ (పీఎల్ఎక్స్). శ్వాస తీసుకోలేకపోవడం, అంతర్గతంగా కిడ్నీ, గుండె తదితర అవయవాలు చెడిపోవడం వంటి తీవ్రస్థితిలో ఉన్న ఏడుగురు పేషంట్లు ఈ మందు వాడిన తర్వాత కోలుకున్నారని కంపెనీ చెబుతోంది. 
 
అందులో ఒకరోగి మాత్రం తీవ్రమైన శ్వాససమస్య అత్యధిక కరోనా రోగుల్లో మరణానికి కారణం ప్రమాదకరమైన రీతిలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం. దీనిని పీఎల్ఎక్స్ నయం చేస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఓ కరోనా రోగికి ఈ మందు ఇచ్చారట. అయితే, దీని ఫలితాలు రావాల్సివుంది.