వ్యాక్సిన్లకు భిన్నం.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్ డోస్ టీకా

corona vaccine
corona vaccine
సెల్వి| Last Updated: శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:07 IST)
కరోనా వ్యాక్సిన్లకు భిన్నంగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ సింగిల్‌ డోస్‌ టీకా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో మధ్య వయసున్న వారిపై ఆ టీకా ట్రయల్స్ నిర్వహించింది.

తాజాగా 16, 17 ఏళ్ల వయసున్న వారిపై టీకా ట్రయల్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత 12 నుంచి 15 ఏండ్ల మధ్య వయసున్న వారిపై కూడా ప్రయోగాలు చేస్తామని పేర్కొంది.

తొలి దశలో యూకే, స్పెయిన్ దేశాలకు చెందిన వారిపై టీకా ప్రయోగాలు నిర్వహించనుంది. ఆ తర్వాత యూఎస్, కెనడా, నెదర్లాండ్స్‌కు చెందిన వారిని ఈ జాబితాలో చేర్చనుంది. గర్భిణి స్ర్తీలు, చిన్నారులపై కూడా ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తెలిపింది.దీనిపై మరింత చదవండి :