గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:13 IST)

న్యూయార్క్ నగరం ఏమైపోతుంది? ఎటు చూసినా శవాలే....

కరోనా వైరస్ న్యూయార్క్ నగరంలో తాండవం చేస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ తన కేంద్రంగా మార్చుకున్నదా అనిపించేటంతటి భయోత్పాతాన్ని కలిగిస్తోంది. గురువారంనాడు న్యూయార్క్ నగరంలో ఏకంగా 799 మంది COVID-19 కారణంగా మృత్యువాత పడ్డారు.
 
గత 24 గంటల్లో 799 మంది మరణించారని, బుధవారం ప్రకటించిన 779 గరిష్ట స్థాయి గణాంకాలను ఇది అధిగమించిందని అక్కడి అధికారులు చెప్పారు. 
 
COVID-19 కారణంగా అమెరికాలో ఇప్పటివరకూ 14,800 మందికి పైగా మరణించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,000కు పెరిగింది. యునైటెడ్ స్టేట్స్ లోని న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ కారణంగా మరిణించిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న మరణాల్లో సగం వున్నాయంటే అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా వుందో అర్థం చేసుకోవచ్చు.