శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (09:38 IST)

రాజమండ్రిలో కరోనా స్ట్రెయిన్ వైరస్ కలకలం!!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కొత్త కరోనా వైరస్ ప్రవేశించింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఈ వైరస్ వెలుగు చూసింది. బ్రిటన్ నుంచి రాజమండ్రికి వచ్చిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. ఈ మహిళ యూకే నుంచి ఢిల్లీకి వచ్చింది. అక్కడ వైద్య పరీక్షలు చేయగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
అయితే, ఆమెను ఢిల్లీలోని క్వారంటైన్‌లో ఉంచగా, అక్కడి నుంచి మహిళ తప్పించుకొని ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రికి వచ్చింది. ఈ సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఆమె ఆచూకీ తెలుసుకొని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె రక్తనమూనాలను సేకరించి, పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలో ఆ మహిళకు సోకింది కొత్త కరోనా కాదా అని ఫలితాల వచ్చాక అధికారులు తేల్చనున్నారు.