శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఆగస్టు 2020 (13:25 IST)

తెలంగాణలో 77వేలకు చేరిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 14 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కు చేరుకోగా.. మరణాల సంఖ్య 615కు చేరుకుంది. 
 
జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్య‌ధికంగా 464 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో భారీగా 187 కేసులు వెలుగుచూశాయి. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో ఇంత ప్ర‌మాద‌క‌ర‌ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. ఆ త‌ర్వాత రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్‌-138, కరీంనగర్‌ జిల్లాలో 101 కేసులు బయటపడ్డాయి.
 
ప్రస్తుతం తెలంగాణలో 22,568 యాక్టివ్ కేసులున్నాయి. 54,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 5,90,306 కరోనా టెస్టులు నిర్వహించారు. జీహెచ్ఎంసీ 464, రంగారెడ్డి 181, వరంగల్ అర్బన్ 187, మేడ్చల్ 138 కేసులు కరీంనగర్ 101, గద్వాల్‌ 95, సంగారెడ్డి 92, పెద్దపల్లి 84, కామారెడ్డి 76 కేసులు నమోదయ్యాయి.