శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: సోమవారం, 19 అక్టోబరు 2020 (12:02 IST)

శీతాకాలంలో కరోనావైరస్ విజృంభణకు అవకాశాలు ఎక్కువ

భారత్‌లో మరికొన్ని వారాల్లో శీతాకాలం రానున్నది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో రాబోయే కొన్ని నెలల పాటు అత్యంత శీతలకర వాతావరణం ఉంటుంది. ఇలాంటి చలి వాతావరణంలో కరోనా వైరస్ ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అభిప్రాయపడ్డారు.
 
యూరప్‌లో కరోనా మహమ్మారి తిరగబెడుతోంది. నెమ్మదించినట్టే నెమ్మదించి మళ్లీ విరుచకబడింది. భారత్‌లో రాబోయేది చలికాలం కావడంతో ఈ వైరస్ తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. దీనిపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నట్లు పాల్ వెల్లడించారు.
 
ప్రస్తుతం భారత్ మెరుగైన స్థితిలో ఉందని, అయితే అనేక అవరోధాలను అధికమించాల్సి ఉందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ మార్కెట్ లోకి వస్తే భద్రపరిచేందుకు కావల్సిన స్టోరేజులు ఉన్నాయని తెలిపారు.