శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: శనివారం, 17 అక్టోబరు 2020 (20:52 IST)

ఏపీ నుంచి కరోనావైరస్ వెళ్లిపోతున్నట్లే వుంది... కొత్త కేసులు తక్కువే

ఏపీ నుంచి కరోనావైరస్ పలాయనం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కరోనా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,881 కరోనా టెస్టులు చేయగా 3,676 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7,79,146కి చేరింది.
 
అయితే ఇందులో 37,102 యాక్టివ్ కేసులు ఉండగా 7,35,638 మంది కరోనా నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6,406కు చేరింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 69,91,258కరోనా పరీక్షలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
 
గడిచిన 24 గంటల్లో చిత్తూరులో అత్యధికంగా ఐదుగురు మరణించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో నలుగురు చొప్పున మరణించగా, విశాఖలో3, అనంతపురం, తూర్పుగోదావరిలో 2, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కరు చొప్పున మరణించారు.