శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (10:03 IST)

దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గతంలో కంటే ఇపుడు ఈ సంఖ్య బాగా తగ్గింది. తాజాగా వెల్లడైన బులిటెన్ మేరకు.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది. 
 
వీటిలో 3,24,09,345 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, ఇంకా 3,84,921 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,42,655 మంది బాధితులు వైరస్‌ వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, గత 24 గంటల్లో 34,848 మంది కరోనా నుంచి కోలుకున్నారని, కొత్తగా 338 మంది మృతిచెందారని తెలిపింది.
 
ఇకపోతే, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు 73,82,07,378 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఇందులో ఒకేరోజు 72,86,883 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్టు తెలిపింది. దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 20,487 కేసులు ఉన్నాయని, 181 మంది మరణించారని తెలిపింది.