బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (18:03 IST)

తిరుమలలో విషాదం, కరోనావైరస్‌తో అర్చకుడు కన్నుమూత

శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనావైరస్‌తో మృతి చెందడంతో తిరుమలలో విషాదం నెలకొంది. కొద్దిరోజుల క్రితమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డెప్యూటేషన్ పైన తిరుమలకు వచ్చిన అర్చకుడుకి వారం క్రితం కరోనా నిర్థారణ కావడంతో వైద్యం కోసం స్విమ్స్‌కు తరలించింది టీటీడీ.
 
స్విమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందాడు. తోటి అర్చకుడు మృతి చెందడంతో అర్చకులు విషాదంలో మునిగిపోయారు.