బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (11:40 IST)

శుభవార్త చెప్పిన కేంద్రం : కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం

కేంద్రం శుభవార్త చెప్పింది. కరోనా భయంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు కేంద్రం చెప్పిన వార్త నిజంగానే సంతోషం కలిగించే వార్తే. దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గిపోతుందని తెలిపింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా 18 రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. 
 
26 రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు సుమారు 15 శాతంగా ఉందని వెల్లడించింది. కరోనా తీవ్రత మేరకు దేశంలో కంటైన్మెంట్ చర్యలు ఉంటాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.
 
అయితే, ఈ వైరస్ ప్రభావం మే చివరినాటికి బలహీన పడుతుందని అంచనా వేస్తుండగా, మూడో వేవ్ వస్తే అది చిన్నారులపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 
 
కరోనా తొలి వేవ్‌లో చిన్నారులపై కరోనా ప్రభావం 1 శాతం కంటే తక్కువ కాగా, సెకండ్ వేవ్‌లో పిల్లలకు కరోనా సోకే రేటు 10 శాతానికి పెరిగింది. అది థర్డ్ వేవ్ నాటికి 80 శాతానికి పెరుగుతుందన్న అంచనాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. 
 
జన్యు ఉత్పరివర్తనాలు చెందే కొద్దీ కరోనా వైరస్ మరింత శక్తిమంతంగా తయారవుతుండడమే అందుకు కారణమని భావిస్తున్నారు. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా పెరుగుతున్నాయి.