WHO: భారత్‌లో 13% తగ్గిన కొత్త కేసులు
జెనీవా: గడచిన వారం రోజుల్లో భారత్‌లో కరోనా కేసులు 13 శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాజా కేసుల నమోదులో మాత్రం భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.
మే 16 వరకు నమోదైన కేసులను.. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం తాజా కేసుల్లో 13 శాతం, మరణాల్లో 5 శాతం తగ్గుదల ఉన్నట్లు వీక్లీ రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ తాజా కేసులు నమోదవుతున్న దేశాల్లో మొదటి స్థానంలో భారత్ ఉండగా.. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, అమెరికా, అర్జంటీనా, కొలంబియా ఉన్నట్లు తెలిపారు.
తాజా మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో నేపాల్, ఇండోనేసియా ఉన్నాయి. దాదాపుగా ప్రపంచంలోని అన్ని రీజియన్లలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆ నివేదికలో వెల్లడించింది.