ఇలా వుంటే కరోనా వ్యాక్సిన్ వేసుకోవద్దు...
1. జ్వరంగా ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేసుకోవద్దు. పూర్తిగా తగ్గిన తర్వాతనే వేసుకోవాలి.
2. అలర్జీల లాంటివేవైనా ఉంటే తగ్గిన తర్వాతనే వ్యాక్సిన్ వేసుకోవాలి.
3. మొదటి డోసు వేసుకున్న తర్వాత ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే రెండో డోసు వేసుకోకూడదు.
4. బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారు, రోగనిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు వ్యాక్సిన్ వేసుకోకపోవడమే మంచిది.
5. బాలింతలు, పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు వ్యాక్సిన్ వేసుకోవద్దు.
6. బ్లీడింగ్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ల అనుమతి తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్ వేసుకోవాలి.
7. ప్లాస్మా ఆధారిత చికిత్స తీసుకున్న కరోనా పేషెంట్లు వ్యాక్సిన్ వేసుకోవద్దు.
8. హెచ్ఐవీ పేషెంట్లు, రక్తం గడ్డకట్టకుండా ఉండే సమస్య ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోవద్దు.
9. డయాబెటిస్, బీపీ అదుపులో ఉంటేనే వ్యాక్సిన్ వేసుకోవాలి.