గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శనివారం, 22 మే 2021 (18:30 IST)

ఏపీలో 20 వేల దిగువకు పడిపోయిన కరోనా కొత్త కేసులు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా కేసులు 20వేలకు దిగువగా నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 90,609 పరీక్షలు నిర్వహించగా 19,981 పాజిటివ్‌ కేసులు.. 118 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,62,060కి చేరింది.

కరోనాతో ఇప్పటి వరకు 10,022 మంది మృతి చెందారు. కరోనా నుంచి 13,41,355 మంది కోలుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 2,10,683 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,85,25,758 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.