బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (17:06 IST)

కరోనా మందు పంపిణీ చేసిన ఆనందయ్య కొత్త పార్టీ

కరోనా వైరస్‌కు మందు పంపిణీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తాజాగా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్టు తెలిపారు. 
 
ఏపీ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కూడా అయిన ఆనందయ్య సోమవారం విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలోని నూకాలమయ్య ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. బీసీ జేఏసీని కలుపుకుని త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తానని తెలిపారు. 
 
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కొత్త వేరియంట్‌తో భయపడుతున్న వేళ.. తన వద్ద దీనికి కూడా మందు ఉందని, ప్రభుత్వం కనుక సహకరిస్తే ఆ మందును ప్రజలకు పంపిణీ చేస్తానని ఆనందయ్య పేర్కొన్నారు.