గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (15:51 IST)

IPL 2024 వేలం.. యష్ దయాల్ హీరో అయ్యాడు.. రింకూ జీరో.. ఎలా?

Yash Dayal
Yash Dayal
IPL 2024 కోసం వేలంలో యష్ దయాల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. RCB యశ్ దయాల్‌ను రూ.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ వేలం తర్వాత కూడా ఎప్పటిలాగే ట్రోల్స్ వచ్చాయి. 
 
ఒక్కో జట్టు అట్టిపెట్టుకున్న చాలామంది సూపర్‌స్టార్‌లు తక్కువ మొత్తాన్ని మాత్రమే అందుకున్నారని, అయితే వారి కంటే తక్కువ ప్రతిభ, స్టార్‌వాల్యూ ఉన్న ఆటగాళ్లు వేలంలో ఎక్కువ డబ్బు అందుకున్నారని ట్రోల్‌లు లేవనెత్తారు. 
 
ఈసారి యశ్ దయాళ్ కూడా అలాంటి ఘాటైన ట్రోల్స్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. గత సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌గా నిలిచిన యశ్‌ దయాల్‌ను ఈసారి జట్టు రిటైన్‌ చేయలేదు. గత సీజన్‌లో స్టార్ జీతం 3.20 కోట్లు. ఈసారి అంత కంటే ఎక్కువ మొత్తానికి ఆర్‌సీబీ ఈ స్టార్‌ను సొంతం చేసుకుంది.
 
 గత సీజన్‌లో రింకు సింగ్ ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత యష్ దయాల్ పేరు అభిమానులలో మరింత పాపులర్ అయ్యింది. అతను గెలవడానికి ఒక ఓవర్‌లో 29 పరుగులు అవసరం. దీంతో ఒక్క ఓవర్‌లో హిడెన్ స్టార్‌గా మారిపోయాడు యష్. 
 
ఈ మ్యాచ్ రింకూ సింగ్‌ను హీరోను చేస్తే య‌శ్ ద‌యాళ్‌ను జీరోని చేసింది. వేలంలో గుజ‌రాత్ టైటాన్స్‌తో పాటు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు అత‌డి కోసం పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు గుజ‌రాత్ వెన‌క్కి త‌గ్గ‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ అత‌డిని రూ.5 కోట్ల‌కు సొంతం చేసుకుంది.