ఆదివారం, 9 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (19:11 IST)

వివాదంలో గుజరాత్ టైటాన్స్.. పొరపాటున అలా చేశాను

Yash Dayal
Yash Dayal
గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ వివాదంలో చిక్కుకున్నాడు. మతపరమైన పోస్టును సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా ఆయన ఇబ్బందుల్లో ఎదుర్కొన్నాడు. ఇది తెలిసి వెంటనే డిలీట్ చేసినా వివాదం యశ్ దయాల్‌ను వదల్లేదు. 
 
లవ్ జిహాద్‌కు సంబంధించి కార్టూన్ చిత్రాన్ని యశ్ దయాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ పోస్టుకు సంబంధించి స్క్రీన్ షాట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
దీంతో క్షమాపణలు చెప్పాడు. తాను పొరపాటున అలా చేశానని చెప్పాడు. దయచేసి క్షమించండంటూ వేడుకున్నాడు. ద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దునని తెలిపాడు.