మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (11:32 IST)

తొలి టీ20లో థ్రిల్లింగ్ విజయం - లెక్కలోకి తీసుకోని రింకూ సింగ్ సిక్సర్.. ఎందుకో తెలుసా?

rinku singh
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత్ ఓడిపోయింది. అయితే, గురువారం నుంచి ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభమైంది. ఇందుకోసం బీసీసీఐ యువ జట్టును మైదానంలోకి దింపింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, రాహుల్, షమి, బుమ్రా, సిరాజ్ వంటి వారు లేకుండానే బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో గురువారం వైజాగ్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ యువ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌ ఆఖరులో భారత బ్యాటర్ రింకూ సింగ్ కొట్టిన సిక్సర్‌ను అంపైర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయినప్పటికీ భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో పరిశీలిస్తే, 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆ జట్టులో స్మిత్ 52, ఇన్‌గ్లిస్ 110, స్టోయినిస్ 7, డేవిడ్ 19, షార్ట్ 13 చొప్పున పరుగులు చేశారు. ముఖ్యంగా, ఇన్‌గ్లిస్ భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు ప్రతి బౌలర్‌ వేసిన బంతికి స్టాండ్ లేదా బౌండరీ లైనా దాటించాడు. ఫలితంగా 50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేశాడు. ఆ తర్వాత 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ మరో బంతి మిగిలివుండగానే గెలుపును సొంతం చేసుకుంది. అయితే, సీన్ అబ్బాట్ వేసిన చివరి ఓవర్‌లో ఏడు పరుగులు మాత్రమే వచ్చాయి. పైగా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్‌ సింగ్‌లు వరుసగా ఔట్ అయ్యారు. దీంతో భారత్ గెలుపై సందేహాలు వ్యక్తంకావడంతో ఉత్కంఠకు గురిచేసింది. 
 
అయితే, చివరి బంతికి ఒక్క పరుగు అవసరం కాగా, క్రీజ్‌లో ఉన్న రింకూ సింగా భారీ సిక్సర్ కొట్టి భారత జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే, ఇక్కడ రింకూ సింగ్ కొట్టిన సిక్సర్‌తో భారత్ గెలవలేదు. బౌలర్ వేసిన బంతిని ఫీల్డ్ అంపైర్లు నోబాల్‌గా ప్రకటించారు. దీంతో ఆ ఒక్క పరుగుతో భారత్‌ విజయానికి అవసరమైన ఒక్క పరుగు రావడంతో భారత్ గెలుపొందింది. మరోవైపు, రింకూ సింగ్ సిక్సర్ కొట్టడంతో స్టేడియంలో అభిమానులు, కేరింతలు, కేకలతో మార్మోగిపోయింది. ఈ కారణంగా రింకూ సింగ్ కొట్టిన సిక్సర్ కాస్త ఆ అరుపుల్లో కలిసిపోయింది. పైగా భారత్ గెలుపొందడంతో భారత జట్టు కూడా ఆ ఆరు పరుగుల కోసం భారత క్రికెట్ జట్టు సభ్యులు కూడా పెద్దగా పట్టించుకోలేదు.