1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2023 (14:59 IST)

దసరా పండుగ.. దేవుళ్లతో పాటు తనకు అత్యంత ఇష్టమైన వాటికి సచిన్ పూజ

sachin pooja
దసరా పండుగను పురస్కరించుకుని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ అభిమానులకు దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అలాగే, ఈ పండుగను పురస్కరించుకుని దేవుళ్లతో పాటు తనకు ఇష్టమైన క్రికెట్ బ్యాట్‌కు కూడా  పూజలు చేశారు. 
 
విజయదశమి పండుగను పురస్కరించుకుని ఆయన తనదైనశైలిలో పూజ చేశారు. పూజగదిలో దేవుళ్లు వద్ద క్రికెట్ బ్యాట్, బంతిని కూడా పెట్టి భక్తితో పూజ చేశాడు. పూజ తర్వాత తన తల్లి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. పూజకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ వేదికగా ఆయన షేర్ చేశాడు. 
 
ఈ సందర్భంగా ఒక అద్భుతమైన మెసేజ్‌ను కూడా పెట్టాడు. అందరికీ దసరా శుభాకాంక్షలు, బంతి బౌండరీ మీదుగా దూసుకెళ్లినట్టే.. చెడుపై మంచి సాధించిన విజయం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. ఒక మంచి కారణం కోసం బ్యాటింగ్‌ను కొనసాగించండి. అందరికీ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి అని ట్వీట్ చేశాడు.