గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (10:22 IST)

అంతర్జాతీయ క్రికెట్‌కు మరో స్టార్ క్రికెటర్ గుడ్‌బై

Aaron Finch
ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. పొట్టి ఫార్మెట్‌లో ఆస్ట్రేలియా జట్టు తరపున సుధీర్ఘకాలం పాటు నాయకత్వ బాధ్యతలు వహించిన ఫించ్.. 2021లో దేశానికి టీ20 ప్రపంచకప్‌ను అందించాడు. ఈ నేపథ్యంలో ఆయన తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. తన కెరీర్‌లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు.
 
టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన ఫించ్.. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఫించ్ తన అంతర్జాతీయ కెరియర్‌లో 8,804 పరుగులు చేశాడు. 17 వన్డే సెంచరీలు, రెండు టీ20 సెంచరీలు సాధించాడు. తన చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడిన ఫించ్.. ఈ మ్యాచ్‌లో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 
 
2018లో జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 76 బంతుల్లో 172 పరుగులు చేసిన పింఛ్.. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అలాగే, 2013లో ఇంగ్లండ్‌తో సౌతాంఫ్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 63 బంతుల్లో 156 పరుగులు చేశాడు. 36 యేళ్ల ఫించ్... తన కెరీర్‌లో కేవలం ఐదు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడగా, 146 వన్డేలు, 103 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.