శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (18:37 IST)

నా కల నిజమైంది.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : దినేష్ కార్తీక్

dinesh karthik
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కల నెరవేరిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
 
డీకే చేసిన పోస్టులో "టీమిండియా తరపున టీ20 ప్రపంచ కప్ ఆడాలన్న లక్ష్యం కోసం చాలా శ్రమించాను. ఇపుడు ఆ కప్ కోసం ఆడటం చాలా గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మేం విజయం సాధించకపోవచ్చు. కానీ అది నా జీవితంలో చాలా జ్ఞాపకాలను నింపింది. నా తోటి ఆటగాళ్లు కోచ్‌లు స్నేహితులు మరియు ముఖ్యంగా అభిమానులకు ఎనలేని మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు" అంటూ పేర్కొన్నారు. 
 
దీంతో దినేష్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. దీంతో అభిమానులు ప్లీజ్.. కఠిన నిర్ణయం తీసుకోవద్దు అంటూ కోరుతున్నారు.